English   

యాస మీదే ధ్యాస పెట్టిన బన్నీ 

Allu Arjun
2020-05-20 17:01:01

అల వైకుంఠపురంలో లాంటి హిట్ తర్వాత బన్నీ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ లేకుండానే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ షూట్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బ వేయడంతో మనోడు అలాగే యూనిట్ అంతా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ సమయాన్ని గట్టిగానే వాడుతున్నాడని ప్రచారం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. సుకుమార్ సినిమాలో క్యారక్టర్ కు ఉన్న చిత్తూరు యాస ట్రైనింగ్ లో తీసుకుంటున్నాడని అన్నారు. షూట్ కి వెళ్ళే నాటికి తన పాత్రకు సంబంధించిన సంభాషణలన్నింటినీ సమర్థవంతంగా అదే యాసలో పలకగలిగేలా ఏకంగా ముగ్గురు ట్యూటర్స్ ని పెట్టుకొని మరీ శిక్షణ తీసుకున్నాడట బన్నీ. చిత్తూరు యాస కోసం చిత్తూరు నుండి ప్రత్యేకంగా ముగ్గిరిని పిలిపించుకుని తన ఇంట్లోనే ఉంచి షిఫ్ట్ ల వారీగా నేర్చుకున్నాడట.

రోజూ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ వీడియో కాల్స్ లో ఈ ప్రోగ్రెస్ కూడా చూస్తున్నారని అంటున్నారు. ఏదో పైపైన కాకుండా జీవితాంతం గుర్తుండిపోఏలాగా ఈ యాసను నేర్చుకున్నాడట బన్నీ. సినిమాలో ఎక్కువ శాతం అడవుల లోపలే జరుగనుందట. ఇందు కోసం కేరళ, వికారాబాద్‌ అటవీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను, ఆ తర్వాత బ్యాంకాక్‌ అడవుల్లో మరికొన్ని సీన్లను తెరకెక్కించనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. బన్నీ సరసన రష్మిక మందన్న నటించనున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుందని ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. అందుకే ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని చెబుతున్నారు. 

More Related Stories