English   

గేగా మారతానంటున్న వర్మ...బుడ్డోడి కోసమేనట

 Ram Gopal Varma
2020-05-20 17:08:13

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చి పరాకాష్టకు చేరిపోతోంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. వర్మ తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ బాడీను ఉద్దేశిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. జూనియర్ ఎన్‌టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ పిక్ ఒకటి విడుదల చేశాడు. అయితే విడుదలైన కొద్ది నిముషాల్లోనే ఈ ఫోటో సోషల్ మీడీయాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముందు ఎన్టీఆర్‌ను ఏకంగా మియా మాల్కోవాతో పోల్చేసిన వర్మ. మియా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేసాడు. ఆ తరువాత మళ్ళీ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి నేను గే అయితే కాదు అది నీకు కూడా తెల్సు, కానీ ఈ ఫోటో చూసాక నేను గే గా మారడానికి అయినా సిద్ధంగా ఉన్నానని ఒక ట్వీట్ చేశాడు వర్మ. అంతే కాకుండా ఆ బాడీ ఏంటిరా నాయన అంటూ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఇప్పుడు నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎటువంటి ఫస్ట్ లుక్ గాని లేక టీజర్ గాని రాకపోవడం తో నందమూరి అభిమానులు చాలా నిరాశకు గురయ్యారనే చెప్పాలి.

More Related Stories