సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్ వారియార్ ఇన్‌స్టా అకౌంట్..అందుకేనా

ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా...అదేనండీ అప్పట్లో ఓ కన్ను గీటి దేశాన్నంతా తన వైపునకు తిప్పుకున్న ఈ కేరళ కుట్టి. ఒరు అదార్ లవ్ సినిమాలో ఓకే ఒక సాంగ్ లో ఆమె కన్ను గీటడం ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి దేశమంతా ఫిదా అయింది. నిజానికి ఆ కన్ను గీటుతో ఆమె చాన్నాళ్ళ పాటు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది. కానీ ఆమె సినిమా మాత్రం మలయాళంలోనే కాదు రిలీజ్ అయిన మిగతా భాషల్లో కూడా ఆశించిన మేర ఆడలేదు. ఎన్నో అంచనాలతో తెలుగు సహా తమిళ బాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి యూత్ రెస్పాన్స్ ఉంటుందని భావించినా యూత్ నుంచి రెస్పాన్స్ కరువైంది. ఈ నేపథ్యంలో ఈ భామ బాలీవుడ్ లో ఛాన్స్ లు కొట్టేసింది. శ్రీదేవి బంగ్లా లాంటి ఒకటి రెండు సినిమాలు చేసినా అవి రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే ఆ మధ్య ఈమె ఒక తెలుగు సినిమా చేయనుందని, నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికయిందని అన్నారు. దాని మీద క్లారిటీ లేదు.
మొన్నటికి మొన్న మహేష్ పరశురామ్ సినిమాలో హీరోయిన్ అన్నారు. అది కూడా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది అది కూడా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా. తాజాగా ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో పెద్ద దుమారమే రేగింది, ఆమె ఇన్‌స్టా డీయాక్టివేట్ చేస్తుంటే తమను వదిలేసి వెళ్తున్నట్టు తెగ ఫీలయిపోయారు కుర్రాళ్ళు. దీంతో ఈ విషయం మీద ప్రియ తండ్రి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిందని, అయితే ఇది తాత్కాలికమేనని ఆమె కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ కావొచ్చని ప్రియ తండ్రి ప్రకాష్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఫేస్బుక్, టిక్‌టాక్ అకౌంట్స్ యాక్టివ్గానే ఉన్నా ఇన్‌స్టా నుంచి బయటకు వెళ్లిందని బాధ పడుతున్నారు అభిమానులు.