English   

దయచేసి అర్థం చేసుకోండి..గాడ్సే గురించి నాగబాబు క్లారిటీ

naga babu
2020-05-20 17:20:33

ఒకప్పుడు చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఓ వివాదస్పద పోస్ట్ పెట్టాడు ఈ మెగా బ్రదర్. అందులో మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మే 19 గాడ్సే పుట్టిన రోజు. గాంధీని గుర్తు పెట్టుకున్న ఈ దేశం గాడ్సే లాంటి నిజమైన దేశభక్తున్ని మరిచిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. అయితే అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే) 'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.

 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని తెలుగులో పోస్ట్ చేసాడు. నాగబాబు వ్యాఖ్యలపై చాలా మంది ఆయన్ను టార్గెట్ చేసి ఒక రేంజ్ లో ఆడుకున్నారు. మీడియా చానెళ్ళు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేశాయి. అయితే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళే అవకాశం కనిపించడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. "దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్ళ కన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం." అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఆయన లెక్క ప్రకారం తను గాడ్సేని వెనకేసుకు రావడం లేదని, కేవలం ఆయన వెర్షన్ చెప్పేవారు కూడా లేరని ఆయన చెప్పుకొచ్చాడు.  

More Related Stories