English   

ప్రముఖ క్రికెటర్‌ తో వరలక్ష్మీ పెళ్లి ‌

Varalakshmi Sarathkumar
2020-05-20 17:31:18

తమిళ సినిమా సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా పరిచయమయిన వరలక్ష్మీ శరత్ కుమార్, తక్కువ కాలంలోనే తన కంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆమెని హీరోయిన్ గానే కాక పలు కీలక పాత్రలకు సైతం బస్సు చేసుకుంటున్నారు నిర్మాతలు. స్వతహాగా ఆమెకు కూడా విభిన్నమైన పాత్రలను చేయడమే ఇంట్రెస్ట్ కావడంతో వాటిని అవలీలగా చేసి పారేస్తోంది ఈ భామ. పందెం కోడి 2, సర్కార్, మారి 2 లలో ఆమె చేసిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేయడమే కాకుండా, మంచిపేరు తెచ్చిపెట్టాయి. దీంతో తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె టాలీవుడ్ లో కూడా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లాంటి డైరెక్ట్ సినిమాలు చేసింది. 

అయితే ఈమె గతంలో విశాల్ ను పెళ్లి చేసుకోనుందని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇద్దరూ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఆ పుకార్లు ఆగలేదు. ఎన్ని సార్లు చెప్పినా ఆమెను విశాల్ మాజీ లవర్ అనే సంభోదించే వాళ్ళు. అయితే విశాల్ నిశ్చితార్ధంతో ఆ పుకార్లు అన్నిటికీ బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు వరలక్ష్మీ గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈమె ఒక ప్రముఖ క్రికెట్‌ ప్లేయర్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం మొదలయింది. 

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ టీమ్ లో కొనసాగుతున్న అతను విరాట్‌ కోహ్లి, ధోనీలకు సన్నిహితుడని అంటున్నారు. ఈ రెండు కుటుంబాలకి కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లి కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే మరో విశేషం ఏమిటంటే వరలక్ష్మి సవతి తల్లి, నటి రాధిక కూతురు కూడా క్రికెట్‌ క్రీడాకారుడు అభిమన్యు మిథిన్‌ను ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో మరో క్రీడాకారుడు భాగం కాబోతున్నాడట. చూడాలి మరి ఈ విషయాన్ని అధికారకంగా ఎప్పుడు ప్రకటిస్తారో ?

More Related Stories