English   

నేడే రానా మిహీకాల ఎంగేజ్మెంట్...

Rana Daggubati
2020-05-20 17:48:29

టాలీవుడ్‌ లో మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ప్రభాస్‌ తో పాటు రానా కూడా లిస్ట్‌ లో ఉంటాడు. అలాంటి రానా మొన్నటికి మొన్న అనూహ్యంగా తన ప్రేయసిని పరిచయం చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో తాను ఎస్ చెప్పింది అంటూ మిహీకా బజాజ్ అనే హైదరాబాదీ ఈవెంట్ మేనేజర్ ని పరిచయం చేశారు. హైదరాబాద్ కి చెందిన మిహీకా ఒక ఈవెంట్ మేనేజర్. సొంతగా డ్యూ డ్రాప్ డిజైనర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసిన ఆమె రెండు మూడేళ్ళ బట్టి ఆ రంగంలో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆమె ముంబైలో సెటిలయింది. ఇక వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందని ప్రచారం జరగగా అదేమీ లేదని వీలయినంత త్వరగా చేస్తామని సురేష్ బాబు ప్రకటించారు. 

అయితే ఆయన ప్రకటించినట్టుగానే ఈరోజు వారి ఎంగేజ్మెంట్ జరగనుంది. దగ్గుబాటి - బజాజ్ ఫ్యామిలీలకు చెందినా అతి తక్కువ మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు చెబుతున్నారు. ఎటూ హైదరాబాద్ లో కంటయిన్మెంట్ జోన్స్ మినహా అన్ని జోన్స్ గ్రీన్ జోన్స్ కావడంతో ఈరోజే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. ఈ విషయం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది. 

More Related Stories