English   

నేను పక్కా లోకల్ అంటున్న డేవిడ్ వార్నర్..

David Warner
2020-05-20 18:00:13

సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాను రాను మరింత చేరువవుతున్నాడు మన ప్రేక్షకులకు. ఈయన క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. అంతగా తెలుగు ఆడియన్స్ కు చేరువ అయిపోతున్నాడు ఈ క్రికెటర్. లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పటికే మొదలవ్వాల్సిన ఐపీఎల్ మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఈ సారి క్రికెట్ ప్రియులకు చేదు వార్తలే ఎదురయ్యాయి. దాంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉండిపోయాడు సన్ రైజర్స్ కెప్టెన్. ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు చేరవయ్యే పనిలో పడ్డాడు డేవిడ్. ముఖ్యంగా తెలుగు హీరోలతో పాటు దర్శకులతో కూడా స్నేహం పెంచుకుంటున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురంలో పాటలతో పాటు పోకిరి, బాహుబలి డైలాగ్స్ కూడా చెప్పాడు డేవిడ్ వార్నర్. ఇప్పుడు మరోసారి రచ్చ చేసాడు ఈయన. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పడమే కాకుండా పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ పాటకు డాన్సులు కూడా చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటికే వార్నర్ కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా వార్నర్ బాగా చేరువైపోయాడు.

More Related Stories