English   

నాగబాబు చెప్పింది నిజం.. గాడ్సేపై సినిమా తీస్తానంటున్న వర్మ..

rgv
2020-05-20 20:26:45

నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈయన నిజమైన దేశ భక్తుడు అంటూ ఆయన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గాంధీని చంపిన వాడిని దేశభక్తుడు అంటావా అంటూ కొందరు మండి పడుతుంటే.. మరికొందరు మాత్రం నాగబాబు చెప్పింది నిజమే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అప్పట్లో మీడియా ఒకవైపు చూపించిందని.. ఇఫ్పటికీ అదే పని చేస్తున్నారంటూ సెటైర్లు కూడా వేసాడు. గాడ్సే సిద్ధాంతాల గురించి సరిగ్గా చూపించి ఉంటే ఆయన కూడా నిజమైన దేశభక్తుడే అంటూ నాగబాబు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయిప్పుడు. ఇప్పుడు దీనికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్ధించాడు.

నాగబాబు చెప్పింది నూటికి నూరు శాతం నిజమని ఆయన కూడా ఒప్పుకున్నాడు. అసలు జీవితంలో ఒక్కసారి కూడా గన్ పట్టుకోని గాడ్సే.. గాంధీని చంపాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయనేది సస్పెన్స్ అంటున్నాడు వర్మ. గాడ్సే కోరుకున్నవి రెండూ నెరవేరినా గాంధీని ఎందుకు చంపాడనేది ఎవరికీ అర్థం కాలేదని.. తెలియదని చెప్పుకొచ్చాడు వర్మ. గాడ్సేపై ఒక్కటంటే ఒక్కటి కూడా క్రిమినల్‌ కేసు కూడా లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పాడు వర్మ. త్వరలోనే గాడ్సేపై ఓ సినిమా చేస్తానని చెప్పాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఉప్పు నిప్పులా ఉండే వర్మ, నాగబాబు.. గాడ్సే విషయంలో ఒక్కటయ్యారన్నమాట.

 

More Related Stories