English   

మెగా సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న జెనీలియా..

chiru
2020-05-21 08:28:49

ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా. నితిన్ లాంటి యంగ్ హీరోలతోనే కాదు వెంకటేష్ లాంటి సీనియర్స్ తోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. బొమ్మరిల్లు సినిమాతో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సంపాదించుకుంది జెన్నీ బేబీ. ఆ తర్వాత ప్రేమించిన రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల వైపు జెనీలియా వస్తుందని తెలుస్తుంది. చిరంజీవి హీరోగా నటించబోయే లూసీఫర్ తెలుగు రీమేక్‌లో ఈమె కూడా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో కీలకమైన పాత్ర కోసం జెనీలియాను రిఫర్ చేస్తున్నాడు మెగాస్టార్. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది.

నటుడు పృథ్విరాజ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన లూసీఫర్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కథ నచ్చి తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. సాహో ఫేమ్ సుజీత్ ఇప్పటికే తెలుగు వర్షన్ కోసం కథ కూడా సిద్ధం చేసాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రి కుమార్తెగా కానీ లేదంటే మీడియా హౌస్ అధినేత పాత్రల్లో ఏదో ఒకటి జెనీలియాతో చేయించాలని చూస్తున్నాడు చిరంజీవి. చాలా రోజులుగా సరైన పాత్ర కోసం చూస్తున్న ఈమెకు లూసీఫర్ మంచి ఆప్షన్ కాబోతుంది. మొత్తానికి చూడాలిక.. చిరు సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?

 

More Related Stories