English   

రానా మిహీకా బజాజ్‌ల ఎంగేజ్మెంట్ మీద సురేష్ బాబు క్లారిటీ

Suresh Babu
2020-05-21 10:44:22

సినీనటుడు రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం నిన్ననే అంటూ వచ్చిన వార్తలపై రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఆయన ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. నిజానికి అదగ్గుబాటి - బజాజ్ ఫ్యామిలీలకు చెందినా అతి తక్కువ మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు నిన్న ఉదయం నుండి ప్రచారం జరిగింది. ఎటూ హైదరాబాద్ లో కంటయిన్మెంట్ జోన్స్ మినహా అన్ని జోన్స్ గ్రీన్ జోన్స్ కావడంతో ఈరోజే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఈ ప్రచారం సాగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతుందని అన్నారు.

అయితే ఈ విషయాన్ని ఖండించిన సురేష్ బాబు ఇరు కుటుంబాలు మర్యాదపూర్వకంగానే కలుసుకుంటున్నాయని ఆయన తెలిపారు. నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీలపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కాగా, రామానాయుడు స్టూడియోలో నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుందని నిన్న వార్తలు వచ్చాయి. పెళ్లి కూతురు మిహీకా బజాజ్ కూడా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది,  'డ్యూ డ్రాప్ డిజైన్' అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 

More Related Stories