English   

మహేష్ కమిట్మెంట్ సూపర్...వెయిటింగ్ అంటోన్న ఫిట్నెస్ ట్రైనర్ 

Mahesh babu
2020-05-21 11:00:07

మినాష్ గాబ్రియల్ అనే పర్సనల్ జిమ్ ట్రైనర్‌‌ గురించి చాలా మందికి మొన్నటి దాకా తెలీదు. ఎప్పుడైతే మహేష్ మహర్షి సమయంలో ఈయన గురించి పేర్కొన్నాక ఆయన గురించి జనానికి బాగా తెలిసింది. పెద్ద పెద్ద అథ్లెట్స్ మొదలుకుని స్టారో హీరోల వరకు ఈయన దగ్గరికే ఫిట్‌నెస్ కోసం వస్తుంటారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఆయన రేంజ్‌‌ ఏంటో తెలుసుకోవచ్చు. మహేష్ బాబు మహర్షి సినిమా లుక్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ గా మినాష్ గాబ్రియేల్ పనిచేశారు. ఆ సమయంలో మినాష్ ట్రైనింగ్ వల్లే చాలా హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నట్లు మహేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మినాష్ అది గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ చేశారు. 

అదేంటంటే ప్రతి రోజు చివరి రోజు లాగా ట్రైనింగ్ సెషన్స్ లో మహేష్ కష్టపడే వారని డైట్ విషయంలో చాకా స్ట్రిక్ట్ గా మెనూ ఫాలో అయ్యేవారని.. అతనితో పని చేయడం గొప్ప అనుభూతినని మినాష్ గాబ్రియేల్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మహర్షి సినిమా నా హృదయానికి చాలా దగ్గరయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నా ఆ సమయంలో మహేష్ ని చాలా దగ్గరగా చూశానని చెప్పుకొచ్చారు. మహేష్ కమిటెడ్ యాక్టర్ మరియు డెడికేటెడ్ పర్సనాలిటీ అని పేర్కొన్న మినాష్ మీతో మళ్ళీ కలిసి పని చేయడానికి ఆతృతగా వెయిట్ చేస్తున్నానని పోస్ట్ చేశారు. 

More Related Stories