English   

చిరంజీవి ఇంట తలసానితో సినీ పెద్దల మీటింగ్

chiranjeevi
2020-05-21 11:37:23

లాక్‌డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా సాధారణ జీవితం గాడిన పడుతోన్నా సినీ పరిశ్రమలో మాత్రం ఇప్పుడప్పుడే సాధారణ స్థితి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. థియేటర్లు తెరిచేందుకు ఇప్పట్లో అనుమతులు లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఇప్పటికి మధ్యలో చాలా సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి ఈ క్రమంలో థియేటర్స్ రెడీ అయ్యే నాటికి షూటింగ్స్‌ పూర్తి చేసుకుంటే మంచిదని భావిస్తున్నారు సినీ పెద్దలు. దీంతో ఇప్పుడు షూటింగ్ అయినా మొదలు పెట్టాలని భావిస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీ. కరోనా, లాక్‌డౌన్ కారణంగా చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అవి ప్రారంభమైతే థియేటర్లు అనుమతించేనాటికి సినిమాలను రిలీజ్‌కు సిద్ధం చేయొచ్చని వారి అంచనా. అంతేకాక ఇప్పుడు షూటింగ్స మొదలు పెడితే అలాగే కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినిమా కార్మికుల సమస్యలూ తీరతాయని భావిస్తున్న్నారు. నాలుగో విడత లాక్‌డౌన్ మొదలు కావడంతో టాలీవుడ్ పెద్దలు దీనిపై దృష్టిపెట్టారు. షూటింగ్స్ అనుమతుల కోసం ప్రభుత్వాలను సంప్రదించడం, సెట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, సమావేశమవ్వాలని భావిస్తున్నారు. నాలుగైదు రోజులుగా సమావేశం కోసం కసరత్తులు జరుగగా ఈరోజు అందుకు ముహూర్తం కుదిరింది. ఈరోజు పదకొండు గంటలకు మంత్రి తలసానితో చిరంజీవి సహా సినిమా పెద్దలు సమావేశం కానున్నారు.  

More Related Stories