English   

ఘనంగా రానా మిహీకా బజాజ్ ల ఎంగేజ్మెంట్

 Rana Daggubati
2020-05-21 12:32:07

రానా-మిహీకా బజాజ్ లకి నిన్న ఎంగేజ్మెంట్ అని నిన్న ఉదయం నుండి మీడియాలో ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో ఈ కార్యక్రమం అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య జరగనుందని ఆ ప్రచారం సారాంశం. అయితే అబ్బే అదేం లేదు, రెండు ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం అంతటికీ క్లారిటీ ఇస్తూ రానా ట్వీట్ చేశారు. ఇట్స్ అఫీషియల్ నౌ అంటూ ట్వీట్ చేశారు. దీని బట్టి రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగిందని అర్ధం అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ పిక్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హీరో రానా, మిహికా బజాజ్ లు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.  పెళ్లి కూతురు మిహీకా బజాజ్ కూడా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది,  'డ్యూ డ్రాప్ డిజైన్' అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.  వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇక ఆయన పెళ్లి మాత్రమే మిగిలి ఉంది. 

More Related Stories