English   

జగన్‌తో చిరంజీవి ప్రత్యేక భేటి.. ఏపీకి టాలీవుడ్ షిఫ్ట్..

Chiranjeevi ys jagan
2020-05-21 16:52:42

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చాలా బిజీ అయిపోయాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటేన్ చేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణలో కేటీఆర్ సహా ఇక్కడ చాలా మందితో చిరుకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆంద్రాలో కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తన పరిచయాన్ని మరింత పెంచుకుంటున్నాడు ఈయన. జగన్ తో చిరంజీవి భేటీ కానున్నాడు. గతేడాది అక్టోబర్ లో ఓ సారి కుటుంబంతో సహా వెళ్లి ముఖ్యమంత్రిని కలిసాడు చిరంజీవి. అయితే అప్పుడు సైరా కోసం వెళ్లానని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ కోసం వెళ్తున్నాడు చిరంజీవి. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద హోదాలో ఉన్నాడు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. లాక్‌డౌన్ సమయంలో కూడా సినీ కార్మికులను ఆదుకోడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవే ముందుగా ముందుకొచ్చాడు. 

తెలంగాణ మంత్రి తలసానితో మాట్లాడి షూటింగ్స్ గురించి చర్చించాడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక భేటీ కానున్నాడనే ప్రచారం జరుగుతుంది. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు కూడా జగన్‌తో భేటీ అవుతారని తెలుస్తుంది. చాలా రోజులుగా దీనిపై ప్రచారం జరుగుతూనే ఉంది. ఏపీని టాలీవుడ్ కు మార్చాలనే ఆలోచన కూడా ఇందులో జగన్ చెప్పబోతున్నాడని తెలుస్తుంది. అందుకే చిరంజీవి,జగన్ భేటిపై తెలంగాణ సర్కార్ కూడా ముందుగానే జాగ్రత్త పడింది. అందుకే చిరంజీవి నివాసంలో సినీ పెద్దలతో తెలంగాణ మంత్రి తలసాని భేటి అయ్యాడు. అందులో కూడా సినిమా ఇండస్ట్రీపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు అనుమతి ఇచ్చారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తామని తెలిపాడు తలసాని. మరోవైపు జగన్ భేటీలో మాత్రం సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు నంది అవార్డుల విషయం చర్చకు రానుందని తెలుస్తుంది. ఈ వారంలోనే జగన్, చిరంజీవి భేటీ జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో చాలా వరకు షూటింగ్స్ విషయంలో సడలింపులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 

More Related Stories