English   

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అనారోగ్యం.. 

Suddala Ashok Teja
2020-05-21 17:04:49

తెలుగు ఇండస్ట్రీలో తన పాటతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఠాగూర్‌లో ఈయన రాసిన నేను సైతం పాటకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంతటి గొప్ప సాహిత్య విలువలు గల పాటలను తెలుగు సినిమాకు అందించాడు సుద్దాల. ఈయన అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నాడు అశోక్ తేజ. ఆయనకి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేస్తున్నారు. దీనికోసమే అశోక్ తేజకు బ్లడ్ కూడా అవసరం పడింది. ఆయనది బ్లడ్ గ్రూప్ బి నెగెటివ్ కాగా.. శస్త్ర చికిత్స సమయంలో రక్తం కావలసి ఉంటుందని అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోమని సన్నిహితులకి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా సన్నిహితులు పోస్ట్ చేసారు. సొంత ఊరు సుద్దాలని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అశోక్ తేజ. నమస్తే అన్న సినిమాతో తెలుగు సినీ తెరకి పరిచయమైన సుద్దాల.. ఎన్నో వందల పాటలు రాసాడు. ఈయన నటుడు ఉత్తేజ్‌కి మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో అద్భుతమైన గేయాలతో అలరించిన ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 

More Related Stories