గ్యాంగ్‌స్టర్స్‌గా సత్తా చూపించిన దక్షిణాది హీరోలు వీళ్లే..

మన హీరోలు ఎప్పుడూ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ కొత్తగా ఉండాలని మాఫియా వైపు కూడా అడుగులు వేస్తుంటారు. అలా సౌత్ ఇండస్ట్రీలో రాఖీ భాయ్, సూర్య భాయ్ సహా మరికొందరు భాయ్‌లు కూడా బాగా ఫేమస్ అయ్యారు. అలాంటి గ్యాంగ్ స్టర్స్ గురించి చూద్దాం..
బాషా: బాషా సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌కు ప్రాణం. ఓ సినిమాకు బ్యాక్ డ్రాప్ ఎలా వాడుకోవాలో చూపించిన సినిమా ఇది. ఇందులో డాన్‌గా రజినీ కేక పెట్టించాడు.
బిజినెస్‌మేన్: సూర్య భాయ్‌గా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలు సృష్టించాడు మహేష్ బాబు. బిజినెస్‌మేన్ సినిమాలో మహేష్ చేసిన నటన అదరహో అనిపించింది.
పంజా: పంజా సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బ్లాక్‌బస్టర్. అందులో ఈయన పాత్రకు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. గెటప్ అయితే ఇప్పటికీ ట్రెండ్.
కెజియఫ్: రాఖీ భాయ్.. ప్రస్తుతం ఇండియా అంతా ఈ పేరుకు మాంచి క్రేజ్ ఉంది. దానికి కారణం కెజియఫ్ సినిమా. అందులో రాఖీ భాయ్‌గా రప్ఫాడించాడు యశ్.
బిల్లా: రజినీకాంత్ బిల్లా సినిమాను అదే పేరుతో విష్ణువర్ధన్ రీమేక్ చేసాడు. అందులో అజిత్ డాన్ పాత్రకు ప్రాణం పోసాడు. ఈ కారెక్టర్‌కు ప్రశంసలు కూడా దక్కాయి.
తెలుగు బిల్లా: బిల్లా సినిమా రీమేక్‌లో ప్రభాస్ కూడా అదిరిపోయే మాఫియా డాన్ రోల్ చేసాడు. అందులో ప్రభాస్ లుక్ ఇప్పటికీ అదుర్స్ అంతే.
యుగంధర్: అప్పట్లో అమితాబ్ బచ్చన్ డాన్ సినిమాను తెలుగులో యుగంధర్ పేరుతో రీమేక్ చేసారు. అందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో నటించాడు.
కబాలి: కబాలి సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్ర అంత ఈజీగా మరిచిపోలేరు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కారెక్టర్ మాత్రం బాగా హిట్ అయింది.
గోలీమార్: గోపీచంద్ కూడా గోలీమార్ సినిమాలో ముందు పోలీస్ ఆఫీసర్‌గా.. ఆ తర్వాత గంగూ భాయ్‌గా రెండు పాత్రలు చేసాడు. ఈ రెండు రోల్స్‌కు ప్రాణం పోసాడు ఈ యాక్షన్ హీరో.
నాయక్: నాయక్ భాయ్ అంటూ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాడు రామ్ చరణ్. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం చరణ్ కెరీర్లో మంచి విజయంగా నిలిచింది.
ఇంటిలిజెంట్: చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు కానీ ఇంటిలిజెంట్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ధర్మా భాయ్‌గా నటించాడు. కాకపోతే సినిమా డిజాస్టర్ కావడంతో మాఫియా వేషాలు కనిపించ లేదు.
అన్న: విజయ్ హీరోగా ఏఎల్ విజయ్ తెరకెక్కించిన తలైవా సినిమాలో మాఫియా డాన్‌గానే కనిపించాడు విజయ్. అయితే ఈ సినిమాపై కొన్ని వివాదాలు చుట్టుమట్టడంతో పాటు కంటెంట్ కూడా యావరేజ్‌గానే ఉండటంతో అనుకున్న ఫలితం రాలేదు.
డాన్: లారెన్స్ తెరకెక్కించిన డాన్ సినిమాలో నాగార్జున మాఫియా కింగ్‌గా కనిపించాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ నాగ్ రోల్ బాగానే పాపులర్ అయింది.