English   

నేచురల్ స్టార్ నాని అరుదైన ఫోటో.. అక్కతో సరదాగా..

nani
2020-05-22 07:29:25

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో పక్కింటి కుర్రాడి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు నాని. అందుకే ఈయన్ని నేచురల్ స్టార్ అంటారు కూడా. ఈయన చేసే సినిమాలు.. ఎంచుకునే పాత్రలు కూడా అన్నీ పక్కింటి కుర్రాడిలాగే ఉంటాయి. నేల విడిచి సాము చేసే పాత్రల వైపు అస్సలు వెళ్లడు నాని. అందుకే మనోడికి ఫాలోయింగ్ కూడా అలా వచ్చేసింది. ఇక సినిమాల్లో ఎంత సింపుల్ గా ఉంటాడో.. బయట కూడా అలాగే ఉంటాడు ఈయన. అలాంటి నానికి సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో నాని తన అక్కయ్య దీప్తితో కలిసి ఉన్నాడు. అది కూడా ఇప్పటిది కాదు.. ఆయన హీరో కాకముందు ఫోటో.. నిక్కర్లు కట్టుకున్నప్పటి ఫోటో అది. ఇప్పుడు ఆ ఫోటో బయటికి వచ్చింది. ఆయన హీరో కాకముందు శ్రీనువైట్లతో ఢీ.. రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు.. బాపుతో రాధాగోపాలం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మాతో హీరో అయ్యాడు. అప్పట్లో చాలా సన్నగా ఉన్నాడు నాని. ఈ ఫోటో చూస్తుంటే చాలా మారిపోయాడే అనిపిస్తుంది. అయితే ఎన్ని మారినా.. అక్కతో ఉన్న రిలేషన్ మాత్రం అలాగే ఉందంటున్నాడు నేచురల్ స్టార్.

 

More Related Stories