English   

మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త..

mb
2020-05-22 07:39:48

చాలా రోజుల నుంచి మహేష్ బాబు కొత్త సినిమా గురించి వేచి చూస్తున్నారు అభిమానులు. నిజానికి సరిలేరు నీకెవ్వరు తర్వాత గ్యాప్త తీసుకోవాలని ముందు నుంచి అనుకున్నాడు మహేష్. అయితే కరోనాతో అది మరింత లాంగ్ అయిపోయింది. ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా కాస్తా ఆగిపోవడంతో ఇప్పుడు పరశురామ్ లైన్ లోకి వచ్చాడు. ఈయన చెప్పిన కథ నచ్చి పూర్తిగా బెండ్ అయిపోయాడు సూపర్ స్టార్. దాంతో పాటు వీడియో కాల్, ఈ మెయిల్స్ తోనే అన్నీ మార్పులు చేర్పులు కూడా చేసాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమాను తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న మొదలు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు ఈయన. కానీ ఇప్పుడు తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకున్నాడు కృష్ణ. అభిమానులు సైతం వేడుకలు నిర్వహించడం కానీ.. తనను కలవడం కానీ చేయవద్దని చెప్పాడు ఈయన.

దానికి కరోనా ఒక కారణమైతే.. మరో ప్రధాన కారణం ఆయన భార్య విజయ నిర్మల 2019 జూన్ 27న మరణించడం. దాంతో తొలి సంవత్సరీకం పూర్తి కాని నేపథ్యంలో సంతాప సూచకంగా కృష్ణ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణ నిర్ణయాన్ని గౌరవించి మహేష్ తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి వేడుకలు కూడా జరపొద్దని ఫిక్స్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పరశురామ్ సినిమా ఓపెనింగ్ ఆ రోజు కూడా ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మహేష్ బాబుతో తాము చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం అదే రోజు ఇస్తారని తెలుస్తుంది. ఇదొక్కటే అభిమానులకు కాస్త శుభవార్త.

 

More Related Stories