మెడిసిన్ వచ్చేవరకు నో షూటింగ్స్ అంటున్న యంగ్ హీరోలు

లాక్డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా సాధారణ జీవితం గాడిన పడుతోన్నా సినీ పరిశ్రమలో మాత్రం ఇప్పుడప్పుడే సాధారణ స్థితి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. థియేటర్లు తెరిచేందుకు ఇప్పట్లో అనుమతులు లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఇప్పటికి మధ్యలో చాలా సినిమాలు షూటింగ్లు మధ్యలో ఆగిపోయాయి ఈ క్రమంలో థియేటర్స్ రెడీ అయ్యే నాటికి షూటింగ్స్ పూర్తి చేసుకుంటే మంచిదని భావిస్తున్న సినీ పెద్దలు షూటింగ్స్ మొదలు పెడితే అలాగే కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినిమా కార్మికుల సమస్యలూ తీరతాయని భావిస్తున్న్నారు. నాలుగో విడత లాక్డౌన్ మొదలు కావడంతో టాలీవుడ్ పెద్దలు దీనిపై దృష్టిపెట్టి నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, సమావేశమయ్యారు, ఈ సమావేశంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
అయితే లాక్డౌన్ వలన అనేక రంగాలలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగ్లు ప్రారంభించాలని సినీ పెద్దలు కోరుతున్నారు. అయితే ఇది పెద్ద హీరోల వర్షన్ గానే చెబుతున్నారు. అదేంటంటే మన తెలుగులో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలు తెరకేక్కుతున్నాయి. అవే ఆర్ఆర్ఆర్, ఆచార్య. ఈ సినిమాల కోసమే నిన్న మీటింగ్ పెట్టారనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే మెడిసిన్ వచ్చేవరకు కుర్ర హీరోలు షూటింగ్ చేయనంటున్నారట. కానీ అప్పటి దాకా వెయిట్ చేస్తే ఇబ్బంది అని భావ్సితున్న ఈ రెండు సినిమాల వాళ్ళే తొందర పడుతున్నారని అంటున్నారు. నిన్న కూడా మీటింగ్ లో ఎక్కువగా ఉన్నది ఆ యూనిట్ వాళ్ళే నని అంటున్నారు. మరి షూటింగ్స్ కి ఎలానో పర్మిషన్ ఇస్తే మిగిలిన హీరోలు వెళ్లి షూట్ చేస్తారో ? లేదో ? చూడాలి.