English   

ఆగస్ట్ నుండి రీ ఓపెన్ కానున్న థియేటర్స్ 

Coronavirus
2020-05-22 12:56:07

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు రెండు నెలలు అయింది. ఇంకా ఎప్పటి దాకా ఉంటుందో తెలియదు.  దీంతో ఆడియన్స్ తో అనునిత్యం కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు పరిస్థితి నార్మల్‌ స్టేజ్‌కు వస్తుందో తెలీని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్‌లో సినిమా ఇండస్ట్రీ వుంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్‌కు రప్పించడం ఎలా? సినిమాలను ఏ పద్ధతిలో రిలీజ్‌ చేయాలి. టిక్కెట్‌ రేట్లు తగ్గించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ ముందు ఉన్నాయి. కరోన తగ్గు ముఖం పట్టి ఒక వేళ  లాక్ డౌన్ మే నెలలో ఎత్తేసినా జనాన్ని ఇప్పట్లో గుంపులుగా అనుమతించే పరిస్థితి లేదు కనుక జూన్ లేదా జులైకి థియేటర్స్ మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. 

అయితే తాజాగా తెలంగాణా  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ తెలుగు చిత్రసీమకు షాకిచ్చాయనే చెపాలి. ఎందుకంటే కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశమే లేదని మూడు-నాలుగు నెలల పాటు థియేటర్స్ రీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదని ఆయన చెప్పారని మొన్న ప్రచారం జరిగింది. అయితే నిన్న చిరంజీవి ఇంట్లో త‌ల‌సానితో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు సినిమా షూటింగ్స్‌ విషయంగా కీల‌క చ‌ర్చలు జ‌రిపిన విష‌యం తెలిసిందే.  అయితే ఇదే సమావేశంలో థియేట‌ర్స్ రీ ఓపెన్ చేయడం గురించి కూడా చర్చించారని అంటున్నారు. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి త్వర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని త‌ల‌సాని చెప్పినట్టుగా పరచం జరిగింది. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం ఆగ‌స్ట్‌ నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే ప్రచారం మొదలయింది. అయితే ఈ ప్రచారం ఎక్కడ మొదలయిందో తెలియదు కానీ సింగిల్ స్క్రీన్‌ లో ప్రతి రోజు మూడు షో స్ ఆడించుకోవచ్చని అంటున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.  

More Related Stories