ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో అలియా భట్

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. అయితే ఈ సినిమాలో కియారాని హీరోయిన్గా తీసుకుంటారనే టాక్ వినిపించింది.
కియారాకి తెలుగు, హిందీ రెండు చోట్ల ఇమేజ్ ఉంది కాబట్టి, సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఈమెని హీరోయిన్గా సెలక్ట్ చేశారని అన్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయిందని ప్రచారం మొదలయింది. నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని సమాచారం. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపుగా ఈ సినిమా లో అలియాభట్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. అలియాభట్ ప్రస్తుతం రామ్చరణ్కు జోడీగా ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎటూ ప్రభాస్ తో చేయబోయే సినిమా ఆర్ఆర్ఆర్ తరువాతనే వస్తుంది. ఎలాగూ ఆర్ఆర్ఆర్ లో ఆమె నటిస్తే ఆ క్రేజ్ కూడా వాడుకోవచ్చని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.