English   

కేసీఆర్‌తో ముగిసిన సినీ పెద్దల సమావేశం..

chiru
2020-05-22 18:01:04

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలుగు సినిమా పెద్దలు కొందరు కూర్చుని మాట్లాడారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ బాగోగుల గురించి చర్చకు వచ్చింది. ముఖ్యంగా రెండు నెలలుగా ఆగిపోయిన షూటింగ్స్ తో పాటు మూసేసిన థియేటర్స్ అనుమతిపై కూడా చర్చించారు. వీటి విధి విధానాలు రూపొందించామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తెలిపారు. ఇప్పుడే దీనిపై ఏ నిర్ణయం తీసుకోవడం కష్టమే అని చెప్పిన ఈయన.. మరో రెండు సార్లు సమావేశం అయ్యాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపాడు. ఇప్పటికే చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంతా కలిసారు. అందులో కూడా తలసాని ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఇదే పని ప్రగతిభవన్ లో చేసారు. సురేష్ బాబు, దిల్ రాజు సహా కొందరు సినిమా పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతా కలిసి త్వరలోనే పూర్తిస్థాయి నిర్ణయాలు వెల్లడిస్తామని చెప్పాడు మంత్రి తలసాని. 

More Related Stories