English   

టాలీవుడ్ పెద్దలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటామంతి..

kishan
2020-05-23 07:30:45

తెలుగు ఇండస్ట్రీ గురించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరుపుతున్నారు. లాక్ డౌన్ ప్రభావం భారీగానే పడటంతో వేల కోట్ల నష్టాలను చూసింది ఇండస్ట్రీ. ముఖ్యంగా బంగారం లాంటి సమ్మర్ సీజన్ అంతా నాశనం అయిపోయింది. దాంతో తమకు న్యాయం చేయాలంటూ కొందరు ముఖ్యమంత్రులను కోరుతున్నారు. మీరే తగిన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో చిరంజీవి సహా టాలీవుడ్ పెద్దలంతా భేటీ అయ్యారు. సమస్యలు చర్చించారు.. దానిపై కేసీఆర్ కూడా కూలంకశంగా చర్చించి సానుకూలంగానే స్పందించాడు కూడా. మరోవైపు జగన్ తో కూడా వీలైనంత త్వరగా భేటీ కావాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా టాలీవుడ్ పెద్దలతో స్పెషల్ లైవ్ ఛాట్ చేయబోతున్నాడు.

ఈ నేఫథ్యంలోనే ఈయన తన ఫేస్ బుక్ పేజీలో ఈ భేటీని లైవ్ లో చూడొచ్చంటూ సోషల్ మీడియాలో తెలిపాడు. మే 23, ఉదయం 11 గంటలకు తాను తెలుగు సినిమా పెద్దలతో మాట్లాడబోతున్నట్లు ప్రకటించాడు కిషన్ రెడ్డి. ఇందులో ఏయే అంశాలు చర్చకు వస్తాయనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రాష్ట్రాలు అయిపోయాయి.. ఇప్పుడు కేంద్రం కూడా సినిమా ఇండస్ట్రీపై కన్నేసిందనే విషయం కిషన్ రెడ్డి భేటీతో అర్థమవుతుంది. మరి ఇందులో ఏం జరుగుతుంది.. ఏ అంశాలపై చర్చిస్తారనేది చూడాలిక. చిరంజీవి, నాగార్జునతో పాటు తెలుగు ఇండస్ట్రీ పెద్దలంతా ఈ భేటీకి హాజరు కానున్నారు.

 

More Related Stories