English   

కొడుకుతో హైట్ పోటీ పడుతున్న మహేష్ బాబు..

mb
2020-05-23 07:51:45

లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు కంటే బాగా ఎవరూ ఎంజాయ్ చేయడం లేదేమో..? ఇప్పటి వరకు పిల్లలతో ఎప్పుడూ గడపనంత హాయిగా.. హ్యాపీగా గడిపేస్తున్నాడు సూపర్ స్టార్. షూటింగ్స్.. గోల లేకుండా ఆనందంగా ఉన్నాడు. ఆగిపోయిన సినిమాలు.. జరగాల్సిన షూటింగ్స్ సంగతి పెద్దోళ్లు చూసుకుంటారులే అని తాను మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబును చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే రోజురోజుకీ మరీ యంగ్ అయిపోతున్నాడు సూపర్ స్టార్. తాజాగా కొడుకు గౌతమ్ తో హైట్ చెక్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. షార్ట్ వేసుకుని కొడుకుతో ఎత్తు కొలుచుకుంటున్నాడు. సరదాగా ఆట పట్టిస్తున్నాడు. ఇప్పటికే గౌతమ్ కూడా దాదాపు తండ్రి ఎత్తుకు వచ్చేసాడు. వాళ్లనలా చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం తింటున్నాడు ఈయన.. లేదంటే దేవుడు ఈయనొక్కడికే వయసు దాచుకునే యంత్రమేమైనా ఇచ్చాడా ఏంటి అన్నట్లుగా ఉన్నాడు సూపర్ స్టార్. అసలు వయసు కనిపించక పోగా.. ఇంకా రోజురోజుకీ యంగ్ అయిపోతున్నాడు మహేష్ బాబు. మొన్నటికి మొన్న గౌతమ్, సితారతో ఉన్న పోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు సూపర్ స్టార్. అందులో మహేష్, గౌతమ్ ను పక్కపక్కనే చూస్తుంటే అన్నాదమ్ముల్లా అనిపిస్తున్నారు కానీ తండ్రీ కొడుకుల్లా మాత్రం కాదు.

తన క్వారంటైన్ టైమ్ అంతా కుటుంబానికే ఇచ్చేస్తున్నాడు ఈయన. మరీ ముఖ్యంగా కూతురు సితారతోనే తన ఆటపాటలన్నీ సాగిస్తున్నాడు సూపర్ స్టార్. హాయిగా ఈ హాలీడేస్ ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరో రెండు నెలల వరకు కుటుంబంతోనే ఉండనున్నాడు ఈయన. ఎలాగూ షూటింగ్స్ లేవు కాబట్టి కుటుంబమే ప్రాణం అంటున్నాడు. ఎప్పటికప్పుడు సితారతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఈయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు మహేష్ గ్లామర్ సీక్రేట్ ఏంటో తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. దీనికి తన కుటుంబమే బలమని ఎప్పుడు అడిగినా చెప్తాడు మహేష్. వాళ్లు లేకపోతే తాను లేనంటాడు. అందులోనే అందం కూడా అంటున్నాడు సూపర్ స్టార్.

More Related Stories