English   

చిరంజీవి ఏంటి మరీ ఇంతగా బరువు తగ్గిపోయాడు..?

chiru
2020-05-23 08:06:20

ఇప్పుడు చిరంజీవిని చూసిన వాళ్లెవరైనా ముందు ఇదే అంటున్నారు. తాజాగా ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు టాలీవుడ్ పెద్దలు. అందులో చిరంజీవి అధ్యక్షతనే అంతా వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్లంతా చిరంజీవి చెప్పిందే పాటించారు కూడా. ఇక అక్కడ చిరును చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. మొన్నటి వరకు కూడా కాస్త బొద్దుగా కనిపించిన మెగాస్టార్ ఇఫ్పుడు చాలా సన్నగా మారిపోయాడు. ఉన్నట్లుండి ఇలా మారిపోడానికి కారణమేంటో మరి..? లాక్‌డౌన్ కదా అని ఇంట్లోనే ఉండి చాలా మంది బరువు పెరుగుతుంటే చిరంజీవి మాత్రం పక్కా డైట్ పాటిస్తూ మేకోవర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఈయన కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది. కరోనా లేకపోయుంటే ఈ పాటికే సినిమా పూర్తై ఉండేది కూడా. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తో ఉన్న ఎపిసోడ్ కోసం బరువు తగ్గాడని తెలుస్తుంది. అందుకే మరింత ఫిట్‌గా కనిపిస్తున్నాడు మెగాస్టార్. ఇదంతా ఆచార్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే అంటున్నారు. రామ్ చరణ్‌తో కలిసి వచ్చే సన్నివేశాల్లో కొడుకుకు పోటీగా కనిపించబోతున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం కూడా సన్నగానే కనిపించబోతున్నాడు అన్నయ్య. ఏదేమైనా 64 ఏళ్ల వయసులో కూడా అన్నయ్య పడుతున్న శ్రమ చూసి అంతా వారెవ్వా అంటున్నారు.

 

More Related Stories