English   

ఆ హీరో తెలుగు డెబ్యూకి హీరోయిన్ గా పూజ

Pooja Hegde
2020-05-23 09:52:00

టాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కొందరు దర్శకులు చేసిన సినిమాలు ఆల్ టైం ఫేవరెట్స్ గా ఉంటాయి. ఆ సినిమాలను ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు. అలాంటి దర్శకుడికి ఒక్క ఫ్లాప్ పడగానే ఆ దర్శకుడిని ఈజీగా మర్చిపోతుంటారు మన నిర్మాతలు. అలాంటి దర్శకులలో ఒకరే హను రాఘవపూడి. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఆడకున్నా మంచి సినిమా అనే పేరు రావడంతో మరో సినిమా సంపాదించాడు. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నా ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు పెద్ద దెబ్బ వేసింది. దీంతో ఆయన తెలుగులో మరే సినిమా చేయలేని పరిస్థితి. 

తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌ తెలుగులో రీమేక్ రీమేక్ చేయబోతున్నరనగానే ఈ ప్రాజెక్టును దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తారనే టాక్ టాలీవుడ్‌లో నడిచింది. అయితే అది ప్రచారానికే పరిమితం అయి తాజాగా ఆయనో బాలీవుడ్ సినిమా తెరకెక్కిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోగా మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయిందని అంటున్నారు. ఇప్పటికే ఆమెకి కథ వినిపించగా ఆమెకు నచ్చిందని అందుకే ఆమె సినిమాలో నటించనుందని అంటున్నారు. లాక్‌డౌన్‌ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.   

More Related Stories