English   

సూర్యకి డబ్బింగ్ చెప్పిన తెలుగు హీరో

 Satyadev
2020-05-23 10:29:59

సింగం3 తర్వాత నుండి తమిళ హీరో సూర్యకు సరైన విజయాలు లేవనే చెప్పాలి. గతేడాది విడుదలైన 'బందోబస్త్' సినిమా కూడా తమిళం సహా తెలుగులో ఆడలేదు. ఇక ఎలా అయినా హిట్ కొట్టాలని భావిస్తున్న ఆయన ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ గోపీనాథ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా  ఏప్రిల్ లో విడుదల కానుంది. దీంతో పాటు మరో మూడు సినిమాలకు సూర్య ఓకే చెప్పారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన సినిమాలకి సంబందించిన ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. 

అదేంటంటే గతంలో సూర్య సినిమాలకి శ్రీనివాస మూర్తి అనే ఆయన డబ్బింగ్ చెప్పేవారు. ఒక్కో సినిమాకి సూర్యనే డబ్బింగ్ చెప్పేవారు కూడా. అయితే ఎందుకో కానీ ఆయన తనకి డబ్బింగ్ చెప్పే వ్యక్తిని మార్చినట్టు చెబుతున్నారు. అయితే ఆ డబ్బింగ్ చెప్పేది ఎవరంటే ? టాలీవుడ్ లో విభిన్న పాత్రలు చేస్తూ పోతున్న సత్య దేవ్. ఆయనే ఆకాశమే హద్దురా తెలుగు వాయిస్ ఇచ్చాడని అంటున్నారు. ఎందుకంటే లాక్ డౌన్ లో సూర్య కానీ, శ్రీనివాస మూర్తి కానీ హైదరాబాద్ వచ్చి డబ్బింగ్ చెప్పలేని పరిస్థితి. అందుకే సత్య దేవ్ చేత చెప్పించారని అంటున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ అయ్యాక రిలీజ్ చేసే అవకాశం ఉంది. 

More Related Stories