English   

స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేసిన శేఖర్ కమ్ముల 

sekhar kammula
2020-05-23 11:24:42

హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి యూత్ ఫుల్  సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. గత ఏడాది ఫిదా అంటూ వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఫిదా చేసిన ఆయన ఆమధ్య ఒక సినిమా చేసి అవుట్పుట్ నచ్చక దానిని కిల్ చేసేసాడు. ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వచ్చింది. ఇది డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు. ఆయా విషయాలు ఎలా ఉన్నా  చివరి దశలో ఉన్న చిత్రీకరణ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. 

ఈ విరామ సమయంలో శేఖర్‌ కమ్ముల తదుపరి సినిమాకి కథ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఆయన చేయబోయే సినిమా ఈసారి స్టార్ హీరోతో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన మొత్తం పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తాడట. అయితే ఈ సినిమాని కూడా ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీని తెరకెక్కిస్తున్న ఏషియన్ సునీల్, నారాయణ్ దాస్ నారంగ్ లే నిర్మించనున్నట్టు చెబుతున్నారు. అయితే శేఖర్ కమ్ములతో చేయనున్న ఆ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా స్టార్స్ తో సినిమా చేయలేదు. అందుకే ఆయన ఎవరిని ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

More Related Stories