English   

నిన్నటినీ ఈరోజునీ ఎప్పటికీ మర్చిపోలేనన్న నాగార్జున

Annamayya  Manam
2020-05-23 11:41:28

మే 22 మరియు మే 23 తేదీలను నేను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ట్వీట్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ రెండు తేదీలు తను ఎందుకు మరిచిపోలేడో కూడా ఆయన తన ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు. 22 ఏళ్ళ క్రితం మే 22న ‘అన్నమయ్య’, ఆరేళ్ళ క్రితం మే 23న ‘మనం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు నాగార్జున కెరీర్ కి ఎంత బాగా ఉపయోగ పడ్డాయో ? తెలియనిది కాదు. తన కెరీర్ లో ఒక మెయిలు రాయి లాంటి సినిమాగా నిలిచిన అన్నమయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటిదాకా లవర్ బాయ్, మాస్ మసాలా సినిమాలు చేసిన నాగార్జున సాక్షాత్తూ అన్నమయ్యే దిగివచ్చాడా అనేలా తన అభినయంతో మెప్పించారు. ఇక మనం సినిమా విషయానికి వస్తే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమానే కాదు, తన ఫ్యామిలీలో మూడు తరాల వాళ్ళు నటించిన సినిమా కూడా. అందుకే ఈ రెండు చిత్రాలు తనకు ఎంతో స్పెషల్ అని నాగార్జున ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఇక ఇక ఈ రెండు సినిమాలు మంచి క్లాసిక్ అన్న నాగార్జున.. అన్నమయ్య, మనం చిత్రాల దర్శకులైన రాఘవేంద్రరావు. విక్రమ్ కుమార్ లకు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలియచేశారు.

More Related Stories