English   

తోపుడు బండి పళ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు..

Solanki Diwakar
2020-05-23 11:47:55

ఓడలు బళ్లు కావడం.. బళ్లు ఓడలు కావడం అంటే ఇదే మరి. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ బిజీ అవుతున్న ఓ నటుడు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడ మొదలెట్టాడో అక్కడికే వచ్చి పడ్డాడు. కుటుంబ పోషణ కోసం ఏం చేయాలో తెలియక తోపుడు బండిపై పళ్లు అమ్ముకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈయన పేరు సోలంకీ దివాకర్. గతేడాది ఆయుష్మాన్ ఖురానా నటించిన సూపర్ హిట్ సినిమా డ్రీమ్ గాళ్ లో ఈయన మంచి పాత్ర చేసాడు. ఈ సినిమాతోనే దివాకర్ కు నటుడిగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరస అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ కరోనా లేకపోయుంటే హాయిగా షూటింగ్స్ చేసుకునేవాడు. కానీ లాక్ డౌన్ వచ్చి అంతా నాశనం చేసింది. దాంతో జీవితం మొదటికి వచ్చేసింది.. కుటుంబ భారం భుజాన పడింది. దాంతో మరో దారి లేక పండ్ల వ్యాపారిగా మారిపోయాడు. రోడ్డుపై బండి తోసుకుంటూ పండ్లు అమ్ముకుంటున్నాడు సోలంకీ దివాకర్. ఈయన పరిస్థితి చూసి అయ్యో అనుకుంటున్నారు కొందరు సెలబ్రిటీస్. ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తేస్తే మళ్లీ నటుడిగా బిజీ అవుతానని చెప్తున్నాడు దివాకర్. 

More Related Stories