English   

సినీ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

 vanisri son dead
2020-05-23 11:59:15

సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ నిన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 36 ఏళ్ళ వెంకటేష్ నై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన నిద్రలోనే చనిపోయినట్టు చెబుతున్నారు. వాణిశ్రీకి ఇద్దరు సంతానం కాగా కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ కూడా ఉన్నారు. ఇక అభినయ్‌ భార్య కూడా వైద్యురాలని వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారని చెబుతున్నారు. ఇక ఈరోజు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. చానళ్ళ పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పినా ఆ తరువాత కూడా అత్త పాత్రలలో నటించి మెప్పించారు. ఫ్యామిలీ డాక్టర్‌నే వివాహం చేసుకున్న వాణిశ్రీ తన కుమారుడిని డాక్టర్ ని చేశారు. ఇక కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలియచేస్తున్నారు. 

More Related Stories