English   

వెంకీ వారసుడు అదిరిపోయాడు.. అర్జున్ ఆజా రాజా..

Arjun Daggubati
2020-05-23 13:00:02

వెంకటేష్ కుమారుడిని చాలా తక్కువ మందే చూసుంటారు. ఎందుకంటే మిగిలిన వారసుల మాదిరి ఈయన అంత త్వరగా బయటికి రాడు. అసలు వచ్చింది కూడా తెలియదు. చూసిన చిన్నపుడే చూసుంటారు. అప్పట్లో సీతమ్మ వాకిట్లో ఆడియో వేడుకను మహేష్, వెంకటేష్ వారసుల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఆ తర్వాత రెండేళ్లకు గోపాలా గోపాలా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించాడు వెంకీ తనయుడు అర్జున్. అది మొదలు ఇప్పటి వరకు మళ్లీ ఆయన బయట కనిపించింది లేదు. ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ ఐడియా లేదు. ఇప్పుడు రానా దగ్గుబాటి రోకా ఫంక్షన్ లో అర్జున్ కనిపించాడు. నూనూగు మీసాలతో పాటు ఇప్పుడిప్పుడే మొలుస్తున్న గడ్డంతో అచ్చం హీరోలా ఉన్నాడు అర్జున్. మనోడి లుక్ చూస్తుంటే మరో రెండు మూడేళ్లలో ఇండస్ట్రీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అర్జున్ వయసు 20 కూడా లేదు. ముందు చదువు.. ఆ తర్వాతే సినిమాలు అంటున్నాడు వెంకటేష్ కూడా. తను కూడా అప్పుడు చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు తన వారసుడి విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు రానా రోకా ఫంక్షన్ కాస్తా అర్జున్ ఇంట్రడక్షన్ లా అనిపిస్తుంది. 

More Related Stories