English   

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత..

Hari Kishan
2020-05-23 16:19:12

తెలుగు కళారంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూసారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బయటికి కూడా రావడం లేదు. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించాడు హరి కిషన్. అతను 8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల కంఠాల్నీ, బంధువులు కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, రాజకీయ నాయకుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అలా అలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత మిమిక్రీ రంగంలో దిగ్గజంగా ఎదిగాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలతో పాటు యంత్రాలు చేసే శబ్దాలు.. సంగీత వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు. తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971లో విజయవాడలో జరిగింది. ఆ తర్వాత దేశవిదేశాల్లో ఎన్నో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. శివా రెడ్డి లాంటి వాళ్లకు ఈయనే గురువు కూడా. 

More Related Stories