English   

వాణి శ్రీకి ఫోన్‌లో ప్రముఖుల పరామర్శ..

Tollywood
2020-05-23 16:41:39

లెజెండరీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఒక్కగానొక్క కుమారుడు అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి సినిమా ఇండస్ట్రీతో పాటు సన్నిహితులు కూడా షాక్ అయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కొడుకు ఇలా విగత జీవిగా పడుండటాన్ని చూసి తట్టుకోలేకపోతుంది వాణి శ్రీ. ఉన్నట్లుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణమేంటో అంటూ అంతా రోదిస్తున్నారు. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలికుండ్రంలోని ఫామ్‌హౌస్‌లో అభినయ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈయన గుండెపోటుతో మరణించాడని ముందుగా మీడియాలో సమాచారం వచ్చింది. దాంతో అంతా అదే తెలిపారు కూడా. 

నిద్రలోనే మరణించాడని.. హార్ట్ ఎటాక్ తోనే కన్ను మూసాడని ప్రచారం జరిగింది. కానీ పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత అసలు నిజాలు బయటికి వచ్చాయి. ఈయన చనిపోయింది గుండెపోటుతో కాదని.. ఉరి వేసుకుని అంటూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈయనకు నాలుగేళ్ళ కుమారుడు.. 8 నెలల కుమార్తె ఉంది. అభినయ్ భార్య కూడా డాక్టర్ గానే పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు వాణి శ్రీని ఫోన్ లోనే పరామర్శిస్తున్నారు. 

More Related Stories