English   

ఇకపై ముద్దులు పెట్టాలంటే భయపడతారంటున్న హీరోయిన్..

 Seerat Kapoor
2020-05-23 17:01:58

ఈ రోజుల్లో లిప్ లాక్ లేని సినిమాలు ఊహించుకోవడం కష్టమే. రీజనల్ లాంగ్వేజెస్ ఏమో కానీ హిందీ సినిమాలు అయితే కచ్చితంగా మూతి ముద్దులు ఉండాల్సిందే. అవి లేకపోతే ఏదో వెలితిగా భావిస్తారు దర్శక నిర్మాతలు. అలాంటిదిప్పుడు ఓ హీరోయిన్ మాత్రం లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్రూమ్ సీన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ 19 కారణంగా దూరం దూరం అంటూ అంతా పాట పాడుతున్నారు. భౌతిక దూరం పాటించకపోతే కచ్చితంగా కరోనా వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. షూటింగ్స్ తిరిగి మొదలైనా కూడా ఇకపై అలాంటి సన్నివేశాలు చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు కూడా భయపడతారేమో అంటూ కామెంట్ చేసింది సీరత్ కపూర్. ఈమె రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రాజు గారి గది 2లో నటించింది. రవితేజతో టచ్ చేసి చూడులో కూడా కనిపించింది. అయితే హిట్స్ రాకపోవడంతో అమ్మడు టాలీవుడ్ నుంచి మాయమైపోయింది. ఇఫ్పుడు కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో లిప్ లాక్స్, బెడ్రూమ్ సీన్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సీరత్ కపూర్. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు లేని సినిమాలు చూడ్డానికి సిద్ధంగా ఉండాలంటూ ఆడియన్స్ కు ముందుగానే చెప్పేస్తుంది సీరత్. 

More Related Stories