English   

చిరంజీవి తీరుతో ఆ హీరోలు అసహనంగా ఉన్నారా..?

chiru
2020-05-23 19:25:39

వ్యతిరేకత లేని నాయకత్వం అనేది ఎక్కడా ఉండదంటారు ప్రజాస్వామ్యంలో. ఎంత బాగా ఉన్నా కూడా నాయకుడిపై ఎక్కడో ఓ చోట వ్యతిరేకత అయితే కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. ఈ మధ్య ఏ మీటింగ్ జరిగినా.. ఏ చర్చ జరిగినా కూడా చిరంజీవి ముందుంటున్నాడు. అన్నీ తానే అయి ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆగిపోయిన సినిమా షూటింగ్స్ విషయంలో కానీ.. జరగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో కానీ అన్నింట్లోనూ ముందు చిరంజీవే కనిపిస్తున్నాడు. ముఖ్యమంత్రితో మాట్లాడటం దగ్గర్నుంచి.. మంత్రి తలసానితో తన ఇంట్లోనే సినిమా పెద్దలతో చర్చించడం వరకు అన్నింటా మెగాస్టార్ ప్రమేయం ప్రముఖంగా కనిపిస్తుంది.

దాంతో ఈ జోక్యం కొందరు హీరోలకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ఒక్కడు అడిగితేనే చేస్తారా.. మేం ఇండస్ట్రీలో లేమా.. లేదంటే మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటూ వాళ్లు సన్నిహితులతో చెప్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి ఏమైనా ఇండస్ట్రీకి నాయకుడా.. లేదంటే అంతా కలిసి ఆయనకు ఏదైనా అధికారం కట్టబెట్టారా.. అన్నింట్లోనూ ఎందుకు అంతగా ముందుకు వెళ్తున్నాడు.. పేరు తీసుకోడానికా అంటూ కొందరు హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైకి మాత్రం చిరంజీవి చాలా మంచి పనులు చేస్తున్నాడు.. ఇండస్ట్రీ కోసం పాకులాడుతున్నాడు అంటూనే లోపల మాత్రం పేరు మొత్తం కొట్టేస్తున్నాడంటూ ఆయన తీరుపై కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే వాళ్లు మీటింగ్స్ కు కానీ.. చర్చలకు కానీ రావడం లేదని ప్రచారం జరుగుతుంది. మరి ఈ దుమారం ఎంత దూరం వెళ్తుందో చూడాలిక.

More Related Stories