English   

నాగబాబుకు ఏమైంది.. ఎందుకిలాంటి ట్వీట్స్ చేస్తున్నాడు..?

nagababu
2020-05-23 19:33:09

ప్రస్తుతం చాలా మందిలో ఇదే అనుమానం ఉంది. ఉన్నట్లుండి దేశభక్తులతో పాటు ఒకప్పటి నాయకులపై నాగబాబు ట్వీట్స్ చేయడం నిజంగానే సంచలనంగా మారుతుంది. మొన్నటికి మొన్న గాడ్సేను దేశభక్తుడు అంటూ ఈయన చేసిన ట్వీట్ సంచలనంతో పాటు వివాదం కూడా అయింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి కామెంట్స్ చేసాడు నాగబాబు. ఈ సారి ఏకంగా కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ఉండటంపైనే ప్రశ్నించాడు నాగబాబు. ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే? స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీగారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.

దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అంటూ నాగబాబు ట్వీట్ చేసాడు. ఇదంతా ఆయన కావాలని చేస్తున్నాడా లేదంటే ఎవరైనా వెనకుండి చేయిస్తున్నారా అదీ కాదంటే ఆర్ఎస్ఎస్ కోసమే నాగబాబు పని చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేైమనా కూడా నాగబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలు చాలా మందికి కోపం తెప్పించినా కొందరు మాత్రం ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదని సమర్థిస్తున్నారు. మరి ఈ చర్చ ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలిక.

More Related Stories