English   

ఏంటీ బావా పెళ్లంట‌గా..తేజ్ ట్వీట్‌..వరుణ్ ఫన్నీ రిప్లై ‌!

varun
2020-05-23 20:16:08

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర గ్రీన్ గాసిప్ లు ఏవైనా ఉన్నాయా అంటే అవి పెళ్లి గాసిప్స్ అనే చెప్పాలి. ఏ వార్తలు దొరకనప్పుడల్లా ఎవరో ఒకరి పెళ్లి వార్త లైం లైట్ లోకి తెస్తారు. నిజానికి ఆయా వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి వాళ్ళన్నా ఆలోచిస్తారో లేదో కానీ గాసిప్ రాయుళ్ళు మాత్రం గాసిప్పుల్లోనే వాళ్ళ పెళ్లి చేసేస్తారు. అదీ ఒక్కోసారి ఒక్కక్కరితో. ఇక టాలీవుడ్‌ పెళ్లి బాజాలు మోగేస్తున్నాయి. ఒకరి వెంట ఒకరు తమకు నచ్చిన వారికి మూడు ముళ్ళు వేసేస్తున్నారు. నిఖిల్ ఇప్పటికే పెళ్లి చేసుకోగా నితిన్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి రెడీగా ఉన్నాడు, అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రానా కూడా పెళ్ళికి రెడీనే. ఇక ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి మాట ఎత్తితే టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబిల్ బ్యాచిలర్స్‌గా పేరొందిన ప్రభాస్, నితిన్‌లు వివాహం చేసుకున్న తరువాత తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు.

అయితే 'F2' సినిమా హిట్ కొట్టాక ఒక ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమా చేసిన తర్వాత నా మైండ్‌సెట్ మారిందని, మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నా ఈ సినిమా తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆయనేదో సినిమా ప్రమోషన్ కోసం అలా మాట్లాడాడు అనుకున్నా. ఆయన తండ్రి నాగబాబు కూడా పెళ్లి చేసేస్తున్నట్టే కామెంట్ చేశాడు.  అయితే ఈ విషయాన్నీ ఒక యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు ఒక వీడియో చేసి వరుణ్ పెళ్లి అని అర్ధం వచ్చేలాగా థంబ్ నైల్ పెట్టారు. ఈ విషయాన్ని సాయిధ‌ర‌మ్‌తేజ్ ఫ‌న్నీగా స్పందించాడు. ట్విట్టర్ లో ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి `ఏంటీ బావ పెళ్లంట‌గా` అని అడగ్గా దీనికి వ‌రుణ్‌తేజ్ అంతే ఫ‌న్నీగా స‌మాధానం చెప్పాడు. `దానికి చాలా టైమ్ వుందిలే కానీ మ‌న రానా ద‌గ్గుబాటి, నితిన్ ఫ‌ర్ ఎవ‌ర్ విత్ యూ అంటూనే సింపుల్‌ గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారని అంటూ ట్వీట్  చేశాడు.

 

More Related Stories