English   

బిగ్ బాస్ ఇంట్లోకి తరుణ్...ఆయన ఏమంటున్నాడంటే ?

biggboss
2020-05-24 07:51:04

దక్షిణాది అన్ని భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్‌ అయింది. ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఏడాది మళ్ళీ నాలుగో సీజన్ కి రెడీ అవుతోంది. మొదటి సీజన్ ని ఎన్టీఆర్ నడిపించగా, రెండో సీజన్ ని నాని నడిపించాడు, ఇక మూడో సీజన్ నాగార్జున  నడిపి అందరి మన్ననలను అందుకున్నారు. ఇక ఈ ఏడాది నాలుగో సీజన్ కి ఇప్పటి నుందే నిర్వాహకులు సన్నాహాలు మొదలు పెట్టారని అంటున్నారు. నాగార్జున ఒక వర్గం మన్ననలను అయితే అందుకున్నారు కానీ టీఆర్పీలు కానీ తెచ్చుకోలేక పోయారు.

అందుకే అయితే ఈ సారి హోస్ట్‌ విషయంలో బిగ్‌బాస్‌ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే హోస్ట్ అంటూ మహేష్ బాబు మొదలు విజయ్ దేవరకొండ దాకా చాలా మంది పేర్లు అయితే ప్రచారం జరిగాయి కానీ తాజాగా ఇందులో కంటెస్టంట్ లు అంటూ కొంత మంది పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. అందులో ఒకప్పటి హీరో తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే అందుతున్న సమాచారం మేరకు తరుణ్ ఈ వార్తను ఖండిస్తున్నాడట. తాను బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టనని, తనని ఆ ఆర్గనైజర్స్ అసలు అప్రోచే అవ్వలేదని అంటున్నాడు. ఒక వేళ అయినా సరే తాను అక్కడ ఉండలేననే చెబుతానని ఆయన అంటున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ అసలు ఆ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లనని చెబుతున్నాడు.

More Related Stories