English   

ఆసుపత్రిలో అజిత్ అండ్ వైఫ్...అసలు ఏమయింది ?

ajith
2020-05-24 09:02:05

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు ప్రపంచమే లాక్ దౌన్ లోకి వెళ్లి పోయింది. అయితే ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య షాలినిలు మాస్కులు వేసుకుని ఆస్పత్రికి వచ్చి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు అజిత్ దంపతులు ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు ? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు నిజం ఏంటనే విషయం ఆరా తీస్తే అజిత్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఆయన్ను చూసేందుకే అజిత్-షాలిని వెళ్లారని అక్కడి మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విష‌యంపై అజిత్ కానీ ఆయన పీఆర్ టీం కానీ ఎలాంటి ప్రక‌ట‌నా చేయలేదు. ఇక అజిత్‌ నటిస్తున్న వాలిమై సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో జరిగింది. లాక్‌డౌన్‌కు ముందు బైక్‌పై చేజింగ్‌ సీన్స్‌ తీశారు. ఈ సీన్స్‌లో అజిత్‌ రైడ్‌ చేసిన బైక్‌ను కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది యూనిట్‌. అజిత్‌ కు బైక్ బాగా నచ్చడంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి దానిపైనే వెళ్లినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సినిమాలో అజిత్ హీరోగా పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లాక్‌డౌన్ ముగియగానే తిరిగి ప్రారంభమవుతుంది.

 

More Related Stories