కిచెన్ లో గరిట పట్టిన రామ్..ఏం చేస్తున్నాడో చూడండి !

కరోనా వల్ల ప్రపంచమే స్థంబించింది. ఇక సినిమాలు ఒక లెక్కా, సినిమా థియేటర్లు సహా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇక థియేటర్స్ లేకుంటే రిలీజ్ లు కూడా ఉండవు కదా. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆ దెబ్బకి ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడినట్టే. దీంతో ఒక రకంగా సినిమాలకి సంబందించిన అప్డేట్స్ కూడా లేకుండా పోయాయి. అయితే మన సినిమా స్టార్స్ మాత్రం ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లాక్డౌన్లో మన సెలబ్రిటీలు గరిట పట్టి నలభీములుగా మారిపోయి తమ అభిమానులకి సర్ప్రైజ్లు ఇస్తున్నారు. ఇదే కోవలో తాజాగా రామ్ కిచెన్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక రామ్ హీరోగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెడ్. రామ్, నివేతా పేతురాజ్, మాళవికా శర్మలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి డించక్ సాంగ్ టీజర్ మొన్న రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కోసం మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంతోంది. రామ్, హెబ్బా పటేల్ మీద షూట్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ కి రెస్పాన్స్ అదురుతోంది. రాములో రాములా సాంగ్ ఇచ్చిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సాకేత్, కీర్తన శర్మలు తమ గాత్రంతో మరో మెట్టు ఎక్కించారు.