English   

బాయ్ ఫ్రెండ్ లేడంటున్న తేజస్వి

teja
2020-05-24 16:01:20

తేజస్వి మాదివాడ అంటే ఎవరూ గుర్తు పట్టరేమో కానీ ‘బిగ్‌బాస్ లో కౌశల్ లో గొడవ పెట్టుకున్న తేజస్వి అంటే యిట్టె గుర్తు పడతారు. హౌస్ లోపల పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్‌ తో ఆన్ కెమెరా సరసాలు సాగించింది. తేజస్వి, సామ్రాట్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద సంచలనం రేపిందనే చెప్పాలి. వాటితో సంబంధం లేకుండా ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సామ్రాట్‌తో చనువుగా ఉంటున్న తేజస్వి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రేపుతోంది. ఇక ఆమె బోల్డ్ స్టేట్మెంట్స్ అలాగే ఆమె లైఫ్ స్టైల్ చూస్తే ఆమెకు ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడని అనుకుంటారు అందరూ. అయితే ఆమె తనకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ విషయం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.  ఇక లోకల్ గ్యాంగ్స్ అనే షో చేస్తున్న ఈ భామ 'కమిట్‌మెంట్' అనే బోల్డ్ సినిమాలో ఆఫర్ పట్టేసింది.. ఈ హైదరబాద్ అమ్మాయి ఇప్పుడీ లాక్ డౌన్ లో కూడా కుర్రకారుకు నిద్ర లేకుండా తన ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది.  

 

More Related Stories