సుమక్కకి అదిరే రోల్...అది కూడా సుక్కూ-బన్నీ మూవీలో

సీనియర్ యాంకర్ సుమ ఏం చేసినా అది సంచలనమే. ఈ మధ్య కాలంలో ఆమె అంత పాపులర్ అయిన లేడీ యాంకర్ మరొకరు లేరు. కేరళ అమ్మాయి అయినా అచ్చ తెలుగు మాట్లాడుతూ అందరినీ కలుపుకు వెళ్తుంది. ఆమె కొన్ని సినిమాలలో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగ పడలేదు. అయితే తాజాగా ఆమె ఒక క్రేజీ సినిమాలో నటించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బన్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులని ఎంపిక చేశారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగా ఆమెను ఇప్పటికే యూనిట్ సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని పాత్రగా మిగిలింది. ఇప్పుడు పుష్ప సినిమాలోనూ సుమకు అదే తరహా పాత్రను సుకుమార్ డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత గ్యాప్ లేకుండా పుష్ప షూట్ జరపాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.