English   

ప్రభాస్ సినిమాకి బాలీవుడ్ నిర్మాతలు ?

prabhas
2020-05-25 08:00:00

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. ఇక ఈయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఈ అవకాశం లేదు కాబట్టి కనీసం నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమాలో ఓ బడా బాలీవుడ్‌ సంస్థ భాగం అయ్యే అవకాశం ఉన్నట్టు చేబుతున్నార్. ఈ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాని జయంతి మూవీస్‌ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం దాదాపు రూ.250కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ ప్రాజెక్టులో ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు ఆ మేరకు దత్తుగారితో చర్చలు కూడా జరిపినట్టు చెబుతున్నారు. త్వరలోనే దీని పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

More Related Stories