English   

సల్మాన్ నే టార్గెట్ చేసిన పూరీ 

Salman Khan
2020-05-25 09:48:50

కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ అయిపోయాయి. ఇక మన ఇండియన్ సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా వాళ్లందరూ దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూనే కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు. మరి కొందరు ఏమో తమ తమ తదుపరి వచ్చే సినిమాలు మీద ద్రుష్టి పెట్టారు. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న‘ఫైటర్’ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పూరీ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. బ్యాంకాక్ బీచ్‌ల‌లో ఎక్కువ‌గా క‌థ‌లు రాసుకునే పూరీ జ‌గ‌న్నాథ్ లాక్ డౌన్ పుణ్యమా అని ఇక్కడే ఇంట్లోనే సినిమా క‌థ‌లు రాసుకుంటున్నాడు. క్వారంటైన్ స‌మ‌యంలో పూరీ కొత్త క‌థ సిద్ధం చేస్తున్న ట్విట్టర్ లో కూడా ప్రకటించాడు. అయితే ఏకంగా ఒకటి కాదు రెండు కధలు రాసేసుకున్నాడట పూరీ. తాజాగా ఈ విషయానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పూరి సిద్ధం చేసుకున్న ఒక పాన్‌ ఇండియా కథ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కోసమట. ఇప్పటికే ఆయనకు కధ వినిపించేలా ప్లాన్ చేసారని అంటున్నారు. దీనికి అక్కడి నిర్మాత కరణ్ జోహార్ సహకరిస్తున్నారని అంటున్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం  ‘ఫైటర్‌’ నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ లాంటి వారితోనే సినిమా చేసిన పూరీ ఇప్పుడు సల్మాన్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అప్పుడే అంచనాలు పెట్టేసుకుంటున్నారు జనాలు. అయితే ఇది ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే  అధికారిక ప్రకటన రావాల్సిందే.

More Related Stories