English   

వకీల్ సాబ్ ఆన్ డ్యూటీ..వెంటనే ఎక్కేస్తారట 

 Pawan Kalyan
2020-05-25 10:37:42

హిందీలో అమితాబ్ లీడ్ రోల్ లో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపు అన్ని బాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని తమిల్ లో నేర్కొండ పార్వాయిగా తెరకెక్కించగా ఇప్పుడు తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండగా కరోనా దెబ్బకు వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో పవన్ సరసన నటించే క‌థానాయిక ఎవ‌ర‌నే విష‌యం మీద కొన్నాళ్లుగా స‌స్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఇపటికే ఈ సినిమాలో నివేదా థామస్,అంజలి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి క్రియేట్ చేసి ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే పవన్ కు ఎవరు నటిస్తారన్నదానిపై ఇప్పటివరకూ ఒక క్లారిటీ రాలేదు. 

ఇక కరోనా కారణంగా స్తంభించి పోయిన టాలీవుడ్ లో నెమ్మదిగా సినిమాల సందడి షురూ కాబోతుంది. ఇప్పటికే నిర్మాణాంతర పనులు చేసుకోవడానికి పరిశ్రమకు అనుమతులిచ్చిన ప్రభుత్వం జూన్‌ నుంచి చిత్రీకరణలు కూడా ప్రారంభించుకోవచ్చని ఓ స్పష్టతనిచ్చేసింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న వకీల్‌ సాబ్‌ ఇప్పటికే 80శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన తుది దశ చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌ రాజు. మరో రెండు వారాల్లో చిత్రీకరణలకు అనుమతులు లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు చేబుతున్నరు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్‌ - జులై నాటి కల్లా చిత్రీకరణను పూర్తి చేసి.. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆగస్టు నాటికి కానీ, థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేదు. కాబట్టి అవి తెరచుకోని ప్రజలు కాస్త అలవాటు పడటానికి మరో రెండు నెలల సమయమైనా పడుతుంది కాబట్టి ఆలోపుకి సినిమాలు అన్నీ రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  

More Related Stories