English   

ముస్లిం సోదరులకు నందమూరి బాలకృష్ణ ఈద్ ముబారక్..

  Balakrishna
2020-05-25 14:16:22

రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులంతా పండగ సందడిలో మునిగిపోయారు. కుటుంబాలన్నీ కలిసి హాయిగా అల్లానామ జపం చేసుకుంటున్నాయి. ఇక రంజాన్ సందర్భంగా మన హీరోలు కూడా ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే చేసాడు. ముస్లిం సోదరులు ప్రేమ త్యాగాలకు ప్రతీక అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. రంజాన్ నెలలో అనుకోకుండా లాక్ డౌన్ వచ్చినా కూడా ఇంట్లోనే ఉండి మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారని గుర్తు చేసాడు. మీ ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు బాలయ్య. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని.. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని వేడుకుంటున్నానంటూ మరోసారి ఈద్ ముబారక్ చెప్పాడు బాలయ్య.
 

More Related Stories