English   

రాశీ ఖన్నాలో ఈ టాలెంట్ కూడా ఉందండోయ్..

Raashi Khanna
2020-05-25 14:55:37

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కేవలం నటిగా మాత్రమే కాదు.. ఇంకా చాలా టాలెంట్స్ చూపిస్తున్నారు కూడా. అయితే వాళ్లు నటిగా ఉండటంతో కేవలం నటనలోనే ఉన్నారని అంతా అనుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మల్లో కంటికి కనిపించని టాలెంట్ కూడా ఉంటుంది. అందులో రాశీ ఖన్నా కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ అందాలతోనే కాదు ఇంకా చాలా టాలెంట్స్ తో మతి పోగొడుతుంది. ప్రతిరోజూ పండగే, వెంకీ మామ లాంటి సినిమాలతో ఈ మధ్య ఫామ్ లోకి వచ్చిన రాశీ.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో విమర్శలు అందుకుంది. అయితే ఇదంతా పక్కన బెడితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన రాశీ.. తనలోని మరో టాలెంట్ చూపిస్తుంది. 

ఇప్పటికే ఈమెలో నటి మాత్రమే కాకుండా సింగర్ కూడా ఉందని తెలుసు. కొన్ని సినిమాల్లో రాశీ పాడింది కూడా. ఈమె పాడిన జోరు టైటిల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. దాంతో పాటు మరిన్ని సినిమాల్లో కూడా పాడింది రాశీ ఖన్నా. ఇక ఇప్పుడు తనలో గిటారిస్ట్ కూడా ఉందని ప్రపంచానికి చూపిస్తుంది. తాజాగా గిటార్ ప్లే చేస్తూ వచ్చిన ఫోటో వైరల్ అవుతుంది. తనలో ఉన్న ఈ టాలెంట్ తో అందర్నీ మాయ చేస్తానంటుంది రాశీ. ప్రస్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తమిళ, హిందీ ఇండస్ట్రీలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది రాశీ. ఇదంతా చూస్తుంటే నటన పూర్తైన తర్వాత సంగీత ప్రపంచంలోనే సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. 

More Related Stories