English   

చిన్నగౌను వేసుకున్న పెద్ద పాప..

Rakul Preet Singh
2020-05-25 15:23:47

ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న డ్రస్ చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది మరి. అయినా ఈ భామ బాలీవుడ్ కు మకాం మార్చిన తర్వాత చాలా వరకు మారిపోయింది. అక్కడ అలవాట్లు కూడా బాగానే ఒంట పట్టించుకుంది. టాలీవుడ్ లో ఉన్నంత కాలం అందాలు ఆర‌బోసింది కానీ ఎక్క‌డో ఓ చోట హ‌ద్దులు అయితే పెట్టుకుంది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత ఆ బౌండ‌రీ లైన్ క‌న‌బ‌డ‌టం లేదు. ఎప్పుడు ప‌డితే అప్పుడు రెచ్చిపోతుంది. అడిగిందే ఆల‌స్యమ‌న్న‌ట్లు అందాల‌న్నీ మూట‌గ‌ట్టి కెమెరా ముందు పెట్టేస్తుంది. ఏమైందో తెలియ‌దు నాకు అంటూ ఎంసిఏలో నాని పాడుకున్న‌ట్లు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది ఇప్పుడు. ఉన్న‌ట్లుండి ఈమె మ‌న‌సు ఎటు కదులుతుందో ఎవ‌రికీ క్లారిటీ లేదు. అంత‌గా సెగ‌లు పుట్టించింది ర‌కుల్. 

బాలీవుడ్ నీళ్ల మ‌హిమో ఏమో కానీ ఇక్క‌డున్న‌పుడు సూక్తులు చెప్పే ర‌కుల్.. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత మాత్రం అవ‌న్నీ తీసి ప‌క్క‌న‌బెట్టేసింది. ఆ మ‌ధ్య మ్యాగ్జిమ్ ఫోటోషూట్ లో మ్యాగ్జిమ‌మ్ అందాలన్నీ ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఇక మొన్న‌టికి మొన్న‌ ఫిట్ నెస్ పేరు చెప్పి మ‌రోసారి అందాల ప్యాకెట్ ఓపెన్ చేసింది. బికినీకి త‌క్కువ కాని డ్ర‌స్ లో అమ్మ‌డు ఒల‌క‌బోసిన వ‌య్యారాలు చూసి చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం. ఇక ఇప్పుడు కూడా చిన్న గౌను ఒకటి వేసుకుని అందులోనే అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టింది ర‌కుల్. త‌న ఫిట్ నెస్ లెవ‌ల్స్ తో పాటు గ్లామ‌ర్ ను కూడా మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లిపోయింది. అందుకే ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా అందాల‌న్నీ తీసి కెమెరా ముందు ప‌రిచేసింది ర‌కుల్. ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది రకుల్. 

More Related Stories