English   

వకీల్ సాబ్‌తోనే థియేటర్స్ రీ ఓపెన్.. పవన్‌తోనే బోణీ..

Vakeel Saab
2020-05-25 17:18:31

థియేటర్స్ అన్నీ మూత పడటంతో బోసిపోయింది ఇండస్ట్రీ. దానికితోడు సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోవడం.. అన్నీ స్థంభించిపోవడంతో కళ తప్పింది ఇండస్ట్రీ. ఇప్పటి వరకు సినిమాలు మొదలైన తర్వాత చరిత్రలోనే తొలిసారి ఇన్ని రోజులు అందరూ పని లేకుండా ఉండటం. కంటికి కనిపించని పురుగు వచ్చి అందర్నీ భయపెడుతుంది. ఇక కరోనా ఎలా ఉన్నా కూడా పనులు మానేసుకుని కూర్చోలేం కదా.. మన పని మనం చేసుకోవాల్సిందే అంటూ ఇప్పుడిప్పుడే అన్ని అనుమతులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ఆగస్ట్ నుంచి థియేటర్స్ ఓపెన్ కానున్నట్లు ప్రకటించారు. అప్పుడు కూడా మూడు షోలతో పాటు థియేటర్స్ లో సగం సీట్స్ మాత్రమే ఉంచాలని రూల్స్ పెట్టారు. అన్నింటికి మించి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా పాటించాల్సిందే. ఇలా అన్నీ చేస్తేనే థియేటర్స్ అనేవి మళ్లీ ఓపెన్ చేసుకోవచ్చని చెబుతుంది ప్రభుత్వం. అన్నింటికి ఓకే అన్న తర్వాత కూడా థియేటర్స్ కు జనాన్ని రప్పించడం అంటే మాటలు కాదు. 

అసలే భయంతో ఉన్న వాళ్లను ఇల్లు వదిలి బయటికి వచ్చేలా చేయాలంటే ఎవరైనా స్టార్ కావాల్సిందే.. ఓ పవర్ ఉండాల్సిందే.. ఆ పవర్ పవన్ కళ్యాణ్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అవును.. థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత ఈయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాను ముందు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. పవన్ లాంటి హీరో వస్తే కానీ ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయరని దర్శక నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందుకే వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా దాన్ని కాదని.. పవన్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ వైపుగా అడుగులేస్తున్నాడు. పైగా ఇంట్లోనే ఉండి ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసాడు పవన్. మరో పది రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా అయిపోతే వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వచ్చేస్తాడు. మరి పవన్ రీ ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో చూడాలిక. 

More Related Stories